తెలంగాణలో కొత్తగా 1,087 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయింది. ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 13,436 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మొత్తం 243 మంది మృతి చెందారు. శనివారం 162 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 4,928 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 8,265 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 888 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డి, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, మహబూబ్ నగర్‌లో 5, నాగర్ కర్నూల్‌లో 4, జనగాంలో 4, సిరిసిల్లలో 3, సిద్దిపేటలో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 2, ఆసీఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.