వర్ధన్నపేట: సోషల్ మీడియాలో తమపై అసభ్యకర పోస్టులు చేస్తున్నారని అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్కి తెరాస ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు శాసనసభ విప్ బాల్క సుమన్, మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్, అరూరి రమేష్, మెతుకు ఆనంద్, క్రాంతి కిరణ్, కాలే యాదయ్య తదితరులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ: దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై అడిషనల్ డిజి జితేందర్కు ఫిర్యాదు చేసాం, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో టిఆర్ఎస్ నేతల పై బీజేపీ సోషల్ వింగ్ తప్పుడు ప్రచారం చేస్తోంది, ఫేక్ వీడియో, తప్పుడు కథనాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అడిషనల్ డిజి జితేందర్ ను కోరాం, తెలంగాణలో దళిత ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను, ఎంపీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరాం, బండి సంజయ్, కిషన్ రెడ్డికి కుటుంబాలు ఉన్నాయి, మీ ఆడవారి మీద ఫేక్ వీడియోలు తయారు చేయాలంటే ఒక్క నిమిషం.

పట్టదు, కానీ మాకు సంస్కారం ఉంది, అందరికి కుటుంబాలు ఉన్నాయి. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. దళిత నేతల ఎదుగుదల చూసి బీజేపీ ఓర్చుకోవడం లేదు, చట్ట ప్రకారం సోషల్ మీడియాలలో పోస్టులు పెడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరాం, సోషల్ మీడియాలలో ఫేక్ వీడియో లో పెడుతున్న వారిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలి పోలీసులు చర్యలు తీసుకోకపోతే మేమే రంగంలోకి దిగుతాం అని హెచ్చరించారు .