వనపర్తి జిల్లా చిన్న బావి మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన బొక్కలమ్మ, కురుమయ్య దంపతులకు కూతురు భువనేశ్వరి (16), కుమారులు అక్షయ కుమార్‌, హేమంత్‌ ఉన్నారు. కూతురు భువనేశ్వరి గత ఏడాది పదో తరగతి పాసైంది. 10వ తరగతి పాసైనా ఇంటి వద్దే ఉంటుంది అయితే, నిన్న సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఫోన్ లో మాట్లాతుండటం అతనితో ఛాటింగ్ చేయడాన్ని ఆమె పెద్ద తమ్ముడు చూశాడు. చూసిన వెంటనే ఈ విషయమూ తండ్రికి తెలిపాడు. ఈ విషయం తెలిసిన భువనేశ్వరి తండ్రి కురుమయ్య ఆమెను మందలించాడు. వయసులో ఉన్న పిల్ల ఇలా చేయడం తగదని మందలించాడు. ఇలాంటివి పునరావృతం అయితే సహించనని హెచ్చరించాడు. తండ్రి మాటలతో భువనేశ్వరి మనస్తాపానికి గురైంది.

తల్లిదండ్రులు తమ్ముళ్లు నిద్రిస్తోన్న సమయంలో అదే అర్థరాత్రి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కొల్లపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచింది. ఈ సంఘటనతో ఆ కుటుంబలో విషాదఛాయలు అలుముకున్నాయి. తనను తిట్టింది తండ్రే కదా అని ఆలోచించి ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు.