స్నేహం చాలా గొప్పది. స్నేహితుడి సంతోషంలోనే కాదు, కష్టాల్లో కూడా పాలుపంచుకుంటారు. ఇదంతా చెప్పేది ఎందుకంటే ఇలాంటి పాత్రలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఉంటారు. వివరాలు: ఏ స్నేహితులైనా గానీ ఎక్కడైనా గానీ ఒక లక్ష, రెండు లక్షలు సాయం చేస్తారు గానీ 25లక్షలు సాయం చేస్తారా.? తమ మిత్రుడు గుండెపోటుతో మరణించాడని ఆయన కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థిక సాయం చేశారు. 2014వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన దుండిగల్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఈ నెల 8న గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన బ్యాచ్ కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్లు టీఎస్, ఏపీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.25 లక్షలను సేకరించి చెక్ ను హయత్ నగర్ లోని ప్రభాకర్ రెడ్డి నివాసంలో అందజేశారు.

ఇందులో రూ. 20లక్షలను ప్రభాకర్ రెడ్డి మూడేళ్ళ కూతురు అక్షయ రెడ్డి పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మిగిలిన 5 లక్షలను ప్రభాకర్ రెడ్డి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న, తల్లిదండ్రులు, ఎల్బీ నగర్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న ఆయన సోదరుడు దయాకర్ రెడ్డి, 2014వ సంవత్సరం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు టాటా శ్రీధర్, రామకృష్ణ, శ్రీనివాస్ తో పాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. మరి చనిపోయిన స్నేహితుడి కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థిక సహాయం చేసిన స్నేహితులకి సెల్యూట్🙏🙏..