తెలంగాణ రాష్ట్రంలో గురువారం 2,207 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 75,257కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 601కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా బారి నుంచి కోలుకుని 1,136 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 53,239కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 21,417 ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా గురువారం 23, 495 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల సంఖ్య 5,66,984కి చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 532 నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 196, వరంగల్‌ అర్బన్‌లో 142, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 136, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, జోగులాంబ గద్వాల జిల్లా 87, కామారెడ్డి 96, కరీంనగర్‌ 93, ఖమ్మం 85, నిజామాబాద్‌ 89, పెద్దపల్లి 71 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.