తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1610 కరోనా కేసులు సోమవారం (27న) నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 57,142కు పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ మంగళవారం కరోనా సమాచారాన్ని విడుదల చేసింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 531 కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 9 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 480కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని మరో 803 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 42,909కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 13,753గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు.

20కి మించి పాజిటివ్‌లు నమోదైన జిల్లాల జాబితాలో: కరీంనగర్‌ (48) జోగులాంబ గద్వాల (340, ఖమ్మం 26, మహబూబ్‌నగర్‌ (23), మేడ్చల్‌ మల్కాజిగిరి(113), జయశంకర్‌ భూపాలపల్లి (20), ములుగు(32), నల్గొండ(26), నిజామాబాద్(‌58), రంగారెడ్డి (172), పెద్దపల్లి (48), వరంగల్‌ అర్బన్‌ (152), సూర్యాపేట (35) జిల్లాలు ఉన్నాయి.