హైదరాబాద్ శివారుల్లో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కీసరలోనూ ఈ రేవ్ పార్టీ కలకలం రేపింది. తాజాగా మేడ్చల్ జిల్లా కీసరలో ఓ ఫర్టిలైజర్ వ్యాపారి తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్ లో సన్నిహితుల కోసం ఆరుగురు అమ్మాయిలతో రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. నల్గొండ సిద్దిపేట వరంగల్, గజ్వేల్ డీలర్ల కోసం ఇది అరేంజ్ చేసినట్టు తెలిసింది. పార్టీలో విందులు అమ్మాయిలతో చిందులు వేసి రచ్చ జరగడంతో విషయం బయటకు పొక్కింది. ఈ సమాచారం పోలీసులకు అందడంతో ఆ రిసార్ట్ పై దాడి చేశారు.

పోలీసులు అక్కడికి చేరుకొని ఆరుగురు యువతులను 10 మంది యువకులను అరెస్ట్ చేశారు.సీడ్స్ కంపెనీ మేనేజర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్లు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. కంపెనీ బిజినెస్ పెంచుకోవడానికి, లోపాయికారీగా సహకరించేందుకు ఓ ఫర్టిలైజర్ వ్యాపారి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే స్థానికులకు ఇబ్బందులు కలగడంతో ఫిర్యాదు చేయగా బండారం బయటపడింది.