కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత ఏపీకి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతను షాద్‌నగర్‌లో రోడ్ల పక్కన చిత్తు కాగితాలు సేకరిస్తూ జీవిస్తూ ఉన్నాడు. భర్త లేని సమయంలో ఆమె ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. అయితే, ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని భార్యకు సూచించాడు.

అయినా కూడా ఆమె అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ప్రియుడు ఆమె కోసం ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంట్లో ఉన్న భర్త చూసి కోపోద్రిక్తుడయ్యాడని. అనంతరం అతడిపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.