తెలంగాణ: చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగూడెం రామవరంలో ఇంట్లోనే ఉరేసుకొని అజయ్‌ కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సొంత అన్నతోపాటు పెద్దమ్మ కుమారుడు గత కొన్నేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారు అంటూ యువతి మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు కావడంతో భయాందోళనకు గురైన అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.