తెల్లారేసరికి పెళ్లి రెండు కుటుంబాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలోనే యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరికి అక్క భర్తతోనే వెళ్లిపోయినట్లు తెలియడంతో వారంతా ఖంగుతిన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం: జగిత్యాలా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (20)కి మరో గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపేందుకు నిశ్చయించారు.

ఆదివారం ఉదయం వధువు ఇంటివద్ద వివాహం జరగాల్సి ఉండగా అంతా సిద్ధంచేశారు. వేకువజామున వెళ్లి చూసేసరికి వధువు కనిపించలేదు. చివరికి పొరుగు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అక్క భర్తనే వివాహానికి వచ్చి, వధువును తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. దీంతో వివాహం నిలిచిపోవడంతో రెండు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. చెల్లె వివాహానికి వస్తే తన భర్తే ప్రేమ పేరుతో ఆమెను తీసుకెళ్లడంతో యువతి అక్క ఆందోళనకు గురైంది.