పక్కింటిని వ్యక్తిని ప్రేమించిన ఓ యువతి మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు: పఠాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన చిన్న కూతురు శ్రావణి(21)తో కలిసి ఉంటుంది. అయితే విజయలక్ష్మి భర్త లక్ష్మారెడ్డి మెదక్ జిల్లాలోని కోహిర్ మండలంలో వేరుగా ఉంటున్నాడు. ఇక, డిగ్రీ పూర్తి చేసిన శ్రావణి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటుంది. అయితే శ్రావణి, తన పక్కింటిలో ఉండే వెంకటరామ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్రేమించకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి మేనమామ రాజేశ్వరరెడ్డి వెకంటరామ్ వద్దకు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. అయితే అందుకు వెంకటరామ్ కుదరదనే సమాధానం ఇచ్చాడు. ఈ పెళ్లికి తన ఇంట్లో వాళ్లు ఒప్పుకోరనిచెప్పాడు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రావణి మేనమామ తమ అమ్మాయి వెంట పడొద్దని హెచ్చరించాడు.

ఈ క్రమంలోనే వెంకటరామ్ శ్రావణికి దూరంగా ఉన్నాడు. అయితే కొన్ని నెలలకు రాజేశ్వరరెడ్డి మృతి చెందడంతో వెంకటరామ్ మళ్లీ శ్రావణి వెంటపడటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లి ఆ యువకుడికి వార్నింగ్ తన కూతురితో మాట్లాడవద్దని హెచ్చరించింది. ఇక, తాను వెంకటరామ్‌ను ప్రేమించినప్పటికీ అతను పెళ్లికి నిరాకరించడంతో శ్రావణి మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే ఇంట్లోని తన గదిలో ఉరేసుకుని కనిపించింది. ఈ ఘటకు సంబంధించి శ్రావణి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.