మేడ్చల్: జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిపబ్లిక్ డే సందర్భంగా, ఆదివారం రోజున కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో కరాటే మాస్టర్ మిస్టర్ బొబ్బిలి రెడ్డి “నీ స్ట్రైక్స్” (knee strike) గిన్నిస్ వరల్డ్ రికార్డు అటెంప్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మిస్టర్ బొబ్బిలి రెడ్డి మాట్లాడుతూ: గతంలో పాకిస్థాన్ పేరున ఉన్న టైక్వాండో 84 నీ స్ట్రైక్స్ నీ, ఇప్పుడు ఒక కాలికి ఐదు కేజీల బరువు మొత్తం 10 కేజీల బరువుతో 104 స్ట్రైక్స్ ఒక్క నిమిషంలో చేసి, రికార్డ్ బ్రేక్ చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి యోధులు మన దగ్గర ఉండటం భారతదేశానికి గర్వకారణమని, అతనిలో ఉన్న దేశ భక్తికిముగ్ధుల అయ్యామని, వారు మరిన్ని రికార్డులు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నట్లు జంట నగరాల మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్కా వెంకట్ రెడ్డి తెలిపారు.