రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చే రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారందరికీ మూడు రోజులుగా ప్రభుత్వం పాసుల జారీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పాసులు జారీ చేయొద్దని స్పష్టం చేసింది.మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మరణాల రేటు తక్కువ ఉన్నప్పటికీ.. ఇరు రాష్ట్రాల మధ్య విస్తృత రాకపోకలను దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా సరిహద్దు ప్రాంతాలైన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.