ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలికోరింది. ప్రేమించిన యువతి మోసం చేసిందని కెనడాలో తెలుగు యువకుడు ప్రణయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నైట్రోజన్‌ గ్యాస్‌ పీల్చి ప్రాణం తీసుకున్నాడు. తన అవయవాలు దానం చేయాలని ప్రణయ్‌ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. అతని స్వస్థలం హైదరాబాద్‌లోని హబ్సిగూడ. కెనడా అధికారులు మృతుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.