తలమడుగు: ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం దెగామలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీరిలో యువకుడు గోడెం శ్రీరామ్‌ మృతిచెందగా అపస్మారక స్థితిలోకి చేరుకున్న యువతి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతోంది.
ఒకే కులానికి చెందిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.