నవాబుపేట(మహబూబ్‌నగర్‌): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్రీనగర్‌కాలనీకి చెందిన యువతి(24), మండలంలోని ఇప్పటూర్‌ పంచాయతీ చౌటపల్లికి చెందిన తిలక్‌గౌడ్‌(25)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.

ప్రస్తుతం తిలక్‌గౌడ్‌ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టానంది. ఈ విషయమై బాధితురాలు నవాబుపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపారని వివరించింది.