తల్లిదండ్రులను కోల్పోయిన అనూషను పెదనాన్న చేరదీశాడు. అయితే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు బాబాయ్‌ పగిడిమర్రి విజయ్‌. గర్భవతి అయిన అనూషను పెదనాన్న కొడుకు అంజి కూడా లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. మూడు రోజులుగా తీవ్ర మనస్థాపంతో భోజనం చేయడం మానేసిన అనూష జీవితంపై విరక్తి చెంది తనువు చాలించింది. అనూష మృతితో పత్తేపురం గ్రామస్తులు నేరేడుచర్లలో ఆందోళనకు దిగారు.

ఐదుగురిపై కేసు నమోదుచేస్తే పోలీసులు కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపిస్తూ రాస్తారోకో చేశాడు. తమకు మృతదేహాన్ని అప్పగించాలని, విజయ్‌, అంజిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనూష ఆత్మహత్యకు కారణం ఆమె బాబాయ్‌, పెదనాన్న కొడుకేనంటున్న పత్తేపురం వాసులు ఐదుగురిపై కేసు పెట్టామన్నారు.