తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం,ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కడియం శ్రీహరితోపాటు ఆయన డ్రైవర్, గన్ మెన్లు,పీఏలు హోం ఐసోలేషన్ కు వెళ్లారు. డ్రైవర్,గన్ మెన్,పీఏకి కూడా కరోనా సోకినట్టు సమాచారం. వీరంతా కూడా హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కాంటాక్టు అయిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్ కు వెళ్లాలని కడియం శ్రీహరి కోరారు. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.