మేనల్లుడని దగ్గరకు తీస్తే, అత్తకి ప్రియుడయ్యాడు చివరకు మామనే చంపేశాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన దారుణం ఇది. థరూర్ మండలం దారవీడు గ్రామంలో భార్య, మేనల్లుడు కలిసి రంగారెడ్డి అనే వ్యక్తిని చంపేశారు. రంగారెడ్డికి భార్య చనిపోవడంతో, రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్క కొడుకునికూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. మేనల్లుడు కదా అని నమ్మేశాడు. అయితే రెండో భార్య, మేనల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది పసిగట్టిన రంగారెడ్డి, భార్యను, మేనల్లుడిని మందలించాడు.

మేనల్లుడిని ఇంటికి రావద్దని చెప్పేశాడు. దీంతో ఇద్దరూ కలిసి రంగారెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నారు. మద్యంతాగి ఇంటికొచ్చిన భర్త సంగతి భార్య, మేనల్లుడికి చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి రంగారెడ్డిని గొడ్డలితో నరికి చంపేశారు. తర్వాత శవాన్ని ఏమిచేయాలో తెలియక ఇంట్లోనే పెట్టేశారు. ఇరుగుపొరుగు ఈ విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు.