మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. తుకారంగేటులో ఓ మైనర్ బాలికపై హోంగార్డు మల్లికార్జున అత్యాచారం చేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 19న హోంగార్డు మల్లికార్జునను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మల్లికార్జునను పోలీసులు కోర్టులో హజరుపరుచడంతో నాంపల్లి కోర్టు నిందితుడికి 30సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో పాటు, బాధితురాలి కుటుంబానికి రూ.40 వేలు చెల్లించాలని ఆదేశించింది.