తెలంగాణ రాష్ట్ర డి.జి.పి. శ్రీ. ఎం.మహేందర్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ జిల్లాల పోలీస్ ఉన్నత అధికారులతో ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన కేసులల్లో జిల్లాల వారీగా పెండింగ్ లో వున్న కేసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష నిర్వహించగా మెదక్ జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు ఈ సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ.మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ: పోలీస్ స్టేషన్ ల పరిసరాలలో 5s సిస్టంను పాటిస్తూ పరిశుభ్రంగా ఉండునట్లు, అదే విధంగా తాను నిర్వహించే సిస్టం, రికార్డ్స్, మరియు ఫైల్స్ క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశంలో ఉండునట్లు చూసుకొని సులభంగా అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. నేర విచారణ అధికారి కేసులలో శిక్షలు పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని, కోర్టులో ట్రయిల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు సాక్షులను మోటివేట్ చేయాలని సూచించారు.

పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తును ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ రిపోర్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తులో పారదర్శకంగా ఎంక్వైరీ చేసి అట్టి రిపోర్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అని సూచించారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ట్రయిల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు సాక్షులను మోటివేట్ చేసి నిందితులకు శిక్షలు పడే విధంగా మానిటర్ చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్లకు, ఎస్పీ అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాల్లో జరిగిన గ్రేవ్ క్రైమ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి ప్రతిరోజు కేసులను టార్గెట్గా పెట్టుకుని ప్రతి పోలీస్ స్టేషన్లలో (యు.ఐ) కేసులు తగ్గించడానికి టార్గెట్ ను దృష్టిలో కేసులు చేదించాలని సూచించారు.ప్రతి యూనిట్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ప్రత్యేక ప్రణాళికతో పెండింగ్ కేసులను తగ్గించాలని ఈ సందర్భముగా అధికారులకు సూచించడము జరిగినది.
ఈ సమావేశంలో జిల్లా అదనపు యెస్.పి. శ్రీ పి. కృష్ణమూర్తి గారు, తూప్రాన్ డి.ఎస్.పి. శ్రీ. కిరణ్ కుమార్ గారు, డి.సి.ఆర్.బి. సి.ఐ. శ్రీ. సునిల్ గారు,జిల్లా సి.ఐ.లు, మరియు జిల్లా పోలీస్ కార్యలయం సిబ్బంది పాల్గొన్నారు.