{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584901615826","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584901523349","source":"other","origin":"unknown"}

కరోనా కారణంగా తెలంగాణలో మార్చ్ 31 వరకు లాక్ డౌన్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆజ్ఞలు జారీ చేసారు. దీనికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఆయా కంపెనీలు ఈ వారం రోజులకు గానూ జీతం చెల్లించాలని సూచించారు ముఖ్యమంత్రి. మరోవైపు ప్రజలంతా ఇల్లు దాటి బయటికి అడుగు పెట్టకూడదని. ఇది మన మంచి కోసమే అని చెప్పారు కేసీఆర్..

కొన్ని అత్యవసర పరిస్థితులు, నిత్యవసర సరుకుల విషయంలో మాత్రమే లాక్ డౌన్ ఉండదని ఆయన చెప్పారు. మిగిలిన అన్ని బంద్ అయిపోతాయని, ఉద్యోగులతో పాటు సినిమా వాళ్లు కూడా వారం రోజులు ఇంట్లోనే అని కేసీఆర్ ఆర్డర్ పాస్ చేసాడు. దీనికి అంతా సిద్ధమైపోయి ఉన్నారు, కరోనా వైరస్ నిలిపేయాలంటే, దాన్ని అరికట్టాలంటే ఇదొక్కటే మార్గమని సూచించారు కేసీఆర్. అయితే దీనిపై ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మాత్రం మరోలా స్పందించింది.

ట్విట్టర్‌లో దీనిపై స్పందస్తూ:

కేటీఆర్ సర్ ! ప్రభుత్వం చెప్పింది పాటించాలి, కానీ కొన్ని ప్రొఫెషన్స్ విషయంలో మాత్రం ఈ పద్దతులు సడలించండి, మేం పని చేయకపోతే మాకు డబ్బులు రావు, కానీ మేం మా ఇంటి రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, EMI భరించాల్సిందే, నెలసరి బిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త మాపై దయ చూపించండి అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు కొందరు అనసూయపై సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. మరి దీనికి మంత్రి గారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలిక.