సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు సంగారెడ్డి రూరల్ పోలీసులు కలిసి, సమాచారం మేరకు కంది చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో KA 56 4144 నెంబర్ గల లారీ నుండి 600 కిలోల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకోవడం జరిగిందని సంగారెడ్డి జిల్లా SP శ్రీ M.రమణ కుమార్ గారు తెలియచేసారు. అనిల్ గోవింద్ (మహారాష్ట్ర లోని లాతూర్ నివాసి) మరియు గణేష్ నంద కిశోర్ (మహారాష్ట్ర లోని లాతూర్ నివాసి) అనే వ్యక్తులు తూర్పు గోదావరి లోని తుని నుండి 600 కిలోల ఎండు గంజాయిని లారీ లో లోడ్ చేసుకుని, ఎవరికీ అనుమానం రాకుండా వీటిపై స్క్రాప్ వస్తువులను ఉంచి, మహారాష్ట్ర లోని పండరిపూర్ కు తరలిసుండగా సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకోవడం జరిగిందని SP గారు తెలిపారు.

నారాయణఖేడ్ లోని ఎనక్.పల్లి గ్రామస్తుడైన అనిల్ రెడ్డి అనే వ్యక్తి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో పైన తెలిపిన వ్యక్తులకు పండరిపూర్ కి గంజాయిని తరలిస్తే 50,000/-రూపాయలు ఇస్తాననే ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో తెలిపారు. వీరి వద్ద పట్టుకున్న ఈ గంజాయి విలువ సుమారుగా 60,00,000/- రూపాయల వరకు ఉంటుందని SP గారు తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన CCS ఇన్స్పెక్టర్ భూపతి గారు, సంగారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ శివలింగం గారు, CCS SI విజయ్ కుమార్ గారు మరియు ఇతర సిబ్బందిని SP గారు ప్రత్యేకంగా అభినందించారు.