ఖమ్మం(కారేపల్లి): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆయన ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష చేపట్టింది. కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన నూనావత్‌ పరోషన్‌ బీటెక్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన భూక్యా సురేష్, ఆమె ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల సురేష్‌కు రైల్వేలో ఉద్యోగం రావడంతో ఇంకో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు.

ఈ విషయం తెలిసినా పరోషన్‌ తనను పెళ్లి చేసుకోవాలని కోరినా ఒప్పుకోలేదు. దీంతో ఆమె తన కుటుంబీకులతో సహా సురేష్‌ ఇంటి ఎదుట శుక్రవారం మౌనదీక్ష చేపట్టింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పరోషన్‌ ఫిర్యాదు చేసింది.