ఆర్టీసీ ఎండికి పంపిన నోటీసులు

కార్మికుల సమ్మె 34వ రోజుకి చేరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ బకాయిల విషయంలో ఆర్టీసీ అధికారులకు పీఎఫ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సిన 760 కోట్ల 62 లక్షల రూపాయలను జమ చేయనట్టుగా తమ దృష్టికి వచ్చిందని పిఎఫ్ రీజనల్ కమిషనర్ ఆర్టీసీ ఎండికి పంపిన నోటీసులో పేర్కొన్నారు.

దీనికి సంబంధించి ఈ నెల 15లోపు పూర్తి సమాచారంతో తమ ముందు హాజరు కావాలని కోరారు. ప్రావిడెంట్ ఫండ్ ఎప్పటికప్పుడు చెల్లించని పక్షంలో భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి తాజా నోటీసులతో మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో ఏర్పడినట్లైంది.