టాలీవుడ్‌లో డ్రగ్స్‌పై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ తీసుకోవడం ప్రత్యక్షంగా చూశాని, బయటకు చెప్తే తన ప్రాణానికి ప్రమాదమని భయంతో ఎవరికీ చెప్పలేదని అన్నారు. ఎక్సైజ్‌ విచారణ తర్వాత కూడా టాలీవుడ్‌ తీరు మారలేదని ఆమె విమర్శించారు. టాలీవుడ్‌లోనూ డ్రగ్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలని మాధవీలత డిమాండ్‌ చేశారు.

ఇటీవల జిన్నారంలో పట్టుబడ్డ వందల కోట్ల డ్రగ్స్‌కి టాలీవుడ్‌కి సంబంధం ఉంటుందని ఆమె ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ విక్రయించేవారు ఎవరు? బాధితులు ఎవరు అనేది అధికారులు తేల్చాలని అన్నారు. సినీ నటులు అందం, ఫిట్‌నెస్‌ కోసం మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటారని అన్నారు.