పెళ్లి సమయానికి వరుడు కనిపించకపోవడంతో మరో యువకుడు పెళ్లి కూతురి మేడలో తాళి కట్టిన వైనం కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాలు: కర్ణాటకలోని చిక్‌ మంగళూరు తారికారే తాలుకాలో సింధు, నవీన్‌ అనే యువతీ యువకులకు పెద్దలు పెళ్లి కుదిర్చి ముహుర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న వారిద్దరి వివాహానికి ముహుర్తం నిర్ణయించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. బంధువులంతా కూడా వచ్చేశారు. తెల్లారితే (మంగళవారం) పెళ్లి ఉండటంతో వచ్చిన బంధువులంతా సంతోషంగా విందు కార్యక్రమాన్ని జరపుకున్నారు. ఈ క్రమంలో ఉదయం పెళ్లి మూహుర్తం దగ్గరపడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా వరుడు నవీన్‌ కనిపించకుండా పోయాడు.

అయితే నవీన్‌ అప్పటికే మరో యువతితో ప్రేమలో ఉండటంతో ఆ యువతి పెళ్లి ఆపేస్తానంటూ బెదిరిచిట్టు సమాచారం. దీంతో భయపడిపోయిన నవీన్‌ పెళ్లి ముహుర్తానికి కొద్ది గంటల ముందు కల్యాణ మండపం నుంచి పరారయ్యాడు. ఇక ఎన్నో ఆశలతో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన నవ వధువు సింధు తీవ్ర నిరాశకు గురైంది. ఆమె జీవితం ఏమవుతుందో అని అందరూ ఆందోళన చెందుతున్న క్రమంలో బంధువుగా పెళ్లికి హజరైన చంద్రు అనే వ్యక్తి సింధును పెళ్లి చేసుకోటానికి ముందుకు వచ్చాడు. దీంతో పెద్దలు వారిద్దరి వివాహం జరిపించారు.