తెలంగాణ నిర్భయ హత్యాచారం కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బాధితురాలి ఇంటికి రాజకీయ నేతలు, కొందరు ప్రముఖులు వెళ్లి ఓదార్చుతున్నారు. నిర్భయ తల్లిదండ్రుల్ని పరామర్శిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని సహా చాలా మంది అధికారులు, నేతలు పరామర్శించారు. అయితే తాజాగా తమ దగ్గరకు ఎవరూ రావొద్దంటూ బాధితులు ఇంటికి తాళం వేసుకున్నారు. తమకు పరామర్శలు వద్దనీ తమ బతుకు తాము బతకనివ్వమని కోరుకుంటున్నారు. ఎవరూ రావద్దంటూ ఉదయం ఇంటికి బోర్డును తగిలించి, ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకున్నారు. తమ బిడ్డను ఎవరూ తిరిగి తీసుకురాలేరని, తమకు న్యాయం కావాలనీ, పరామర్శలు వద్దని వారు అంటున్నారు…