ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన చేదు అనుభవం ఇది. ముహ్ అనే 31 ఏళ్ల వ్యక్తి, మిటా అనే 25 ఏళ్ల యువతిని ఫేస్‌బుక్‌లో చూసి ప్రేమించాడు. రోజూ ఆమెతో చాటింగ్ చేస్తూ, తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమె కూడా అతడికి ఓకే చెప్పింది. రోజూ చాటింగ్ చేసి బోరు కొట్టడంతో నేరుగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే ఇద్దరూ ఒక కేఫ్‌లో కలుసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడటంతో కొన్ని వారాలు కలుసుకున్నారు. ముహ్‌కు రోజూ ఆమె కలలోకి వచ్చేది. ఆమెను వదిలి క్షణం కూడా ఉండలేకపోయేవాడు. దీంతో ఓ రోజు కాఫీ షాపులో కలిసి మనసులో మాట చెప్పేశాడు. పెళ్లి చేసుకుందామని చెప్పడంతో ఆమె కూడా అంగీకరించింది. తన పెద్దలతో మాట్లాడాలని చెప్పింది.

ముహ్ పెద్దలు, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు, అక్కడి సాంప్రదాయం ప్రకారం ఆమెకు కట్నంగా రూ.1.08 లక్షలు ఇచ్చారు. జూన్ 2న జావాలోని కెదిరలో జరిగిన వివాహ వేడుకలో ముహ్, మిటాలు సాంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఇంట్లో శోభనానికి ఏర్పాట్లు చేశారు. తొలిరాత్రి ఆమెతో ఎంజాయ్ చేద్దామని కలలు గన్న ముహ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు ఇప్పుడు ఆ పని చేయడ ఇష్టం లేదని, ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఆ రాత్రి ఏం జరగలేదు. రెండో రోజు రాత్రి కూడా ఇదే జరిగింది. దీంతో ముహ్‌కు మీటాపై అనుమానం వచ్చింది.

మూడో రాత్రి కూడా అదే పరిస్థితి ఎదురుకావడంతో ముహ్, ఆమె గురించి తెలుసుకోడానికి ప్రయత్నించాడు. ఆమెను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ‘‘నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని ’’ అని తెలపడంతో అతడు షాకయ్యాడు. ఇన్ని రోజులు తాను ప్రేమించింది అమ్మాయినా అని మదనపడ్డాడు. కోపంతో మీటాను ఇంటి నుంచి గెంటేశాడు. విడాకులు దరఖాస్తు చేయడమే కాకుండా, ఆమె చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.