మేదక్: జిల్లాలోని రామాయంపేట మండలం ఢీధర్మారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇంట్లోనే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం తక్షణమే సిద్దిపేట సర్కార్ దవాఖానకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌ రెడ్డి(29), రుచిత(25)గా గుర్తించారు. వీరకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనసై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆవేశపూరిత నిర్ణయానికి ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలారని పోలీసులు తెలిపారు.