ప్రస్తుతం చిత్ర సీమలో వరుస విషాదాలు చోటచేసుకుంటున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొందరు, ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడి మరికొందరు మరణిస్తున్నారు. మొన్నటి మొన్న ప్రముఖ నటుడు రావి కొండల రావు అనారోగ్యంతో కన్నుమూసారు. అంతకు ముందు బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇప్పటికే ఆయన ఆత్మహత్యపై పలు సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి.

తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య స్వర్గస్తులయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య ఈ రోజు ఉదయం 6 గంటలకు కన్నుమూసారు. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శేఖర్ కమ్ముల విషయానికొస్తే, నాగ చైతన్య, సాయి పల్లవిలతో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాలేదు. లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు…