ఢిల్లీలోని గుర్గావ్‌లో దారుణం జరిగింది. 16ఏళ్ల ఓ బాలుడు తనకు సోదరి వరుసయ్యే 15ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను బెడ్‌కి కట్టేసి రేప్‌కి పాల్పడ్డాడు. గుర్గావ్‌లోని సెక్టార్ 51 ఏరియాలో గురువారం ఈ ఘటన జరిగింది. మరుసటి రోజు ఆ బాలిక స్కూల్లో స్పృహ తప్పి పడిపోవడంతో టీచర్ ఆమెను విచారించింది.దీంతో జరిగిన ఘటనను ఆమెకు వెల్లడించింది.

సదరు టీచర్ బాలిక తల్లికి అసలు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల అబ్బాయి తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల తమ బంధువుల్లో ఓ మహిళకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంట్లో పనులు చేసేందుకు కుమార్తెను పంపించానని ఆమె చెప్పారు.

ఆమె వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆమె కొడుకు తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఆమె కాళ్లు,చేతులను మంచానికి కట్టేసి అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు…