ముంబైలోని అక్షా బీచ్‌లో గోనె సంచిలో లభ్యమైన మృతదేహాం కేసును పోలీసులు చేధించారు. గోనె సంచిలోని మృతదేహం ఈస్ట్‌ కాందివ్లీకు చెందిన నందినిగా గుర్తి్ంచారు. ఈ హత్య గల కారణాలను పోలీసులు వివరించారు. నందిని హత్య చేసింది ఆమె మామనే అని మీడియాకు తెలిపారు. కేసు వివారాల్లోకి వెళితే.. నందిని ఈస్ట్‌ కాందివ్లీకి చెందిన పంకజ్‌ని 3 ఏళ్ళ క్రితం వివాహం చేసుకుంది. ఈ పెళ్ళి పంకజ్ తండ్రి కమల్‌ రాజ్‌కు ఇష్టం లేదు. అప్పటినుంచి నందినిని హింసించడం మెుదలుపెట్టాడు. క్యారెక్టర్‌పై నిందలు వేస్తూ వచ్చాడు. పెళ్ళై మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కోడాలిని మామ మానసికంగా హింసిస్తున్నే ఉన్నాడు. ఈ క్రమంలో పంకజ్ పని మీద వేరే ఊరికి వెళ్లాడు. కోడుకు లేని సమయాన్ని అదునుగా చూసిన కమల్, నందినిని ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. దీంతో డిసెంబర్‌ 9న ఆమె నిద్రుస్తున్న సమయంలో దిండుతో నొక్కి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి.

దగ్గరలోని కండివిల్లి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న నాలాలో పడేశాడు. మురుగు నీటి ప్రవహాంతో కొట్టుకువచ్చిన గోనె సంచిలోని మృతదేహం డిసెంబర్‌ 24న ఆక్షా బీచ్‌ వద్ద కనిపించింది. దాన్ని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. మరో ఇద్దరి సహాయంతో కమల్, నందిని హత్య చేసినట్టు తెల్చారు.