ఆయనో స్కూలు హెడ్మాస్టర్. బాధిత బాలిక అతనివద్ద ఎనిమిదో తరగతి చదువుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిశా రాష్ట్రంలోని బుధ్‌ఘడ్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇక్కడ గణేష్ చతుర్థి సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజ చేశారు. ఈ పూజలో పాల్గొనేందుకు వచ్చిన బాలికల్లో ఎనిమిదో తరగతి చదివే ఓ బాలిక కూడా ఉంది. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ మైనర్ బాలికను హెడ్మాస్టర్ తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ లైంగిక దాడి ఘటనను ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్థులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్మాస్టర్ పరారీలో ఉన్నాడు. బాలికను లైంగికంగా వేధించిన హెడ్మాస్టరుపై పోస్కో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న హెడ్మాస్టర్ కోసం గాలిస్తున్నారు.