కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే జరగాల్సిన ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా నితిన్ పెళ్లి వాయిదా పడింది. అదే బాటలో నిఖిల్ పెళ్లి కూడా పోస్ట్ పోన్ అయింది. తాజాగా ఈ కరోనా విజృంభిస్తున్న ఈ టైమ్‌లో నిర్మాత దిల్ రాజు ఎంతో సింపుల్‌గా పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్యర్యపరిచారు. దిల్ రాజును చూసి హీరో నిఖిల్ కూడా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. కాసేపటి క్రితమే తన బంధు మిత్రులు కొద్ది మంది సమక్షంలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. ముందుగా నిఖిల్.. ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలనకున్నాడు.

కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత మే 14న ఈ రోజు ముహూర్తం పెట్టుకున్నారు. కానీ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ 17 వరకు ఉండటంతో అసలు పెళ్లి జరుగుతుందా లేదా అని అందరు డౌట్ పడ్డారు. కానీ దిల్ రాజు ఇంత లాక్‌డౌన్ పీరియడ్‌లో సింపుల్‌గా పెళ్లి చేసుకోవడంతో … నిఖిల్ కూడా ముందుగా నిశ్చయించిన ముహూర్తం ప్రకారం కాసేటి క్రితమే పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి హైదరాబాద్ సమీపంలోని శామీర్ పేటలోని ఓ రిసార్ట్‌లో జరిగింది. ఇక నిఖిల్‌ను నిన్న పెళ్లి కొడుకు చేసిన సందర్భంగా విడుదల చేసిన ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే కదా.