దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశా హత్యాచర ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్,టీఆర్ఎస్ నేత శోభ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేకనే అంత ఆపద సమయంలోనూ తండ్రికి ఫోన్ చేయకుండా చెల్లెలికి ఫోన్ చేసిందన్నారు. చెల్లెలికి బదులు తండ్రికి ఫోన్ చేసి ఉంటే ఆయన వచ్చి తీసుకెళ్లేవారని అన్నారు.

మహిళలపై అత్యాచార ఘటనల నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నిందితులు తనను అడ్డుకున్నారని తల్లిదండ్రులకు చెప్పడానికి ఆమె భయపడిందని అందుకే చెల్లెలికి ఫోన్ చేసిందని అన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ అయిన దిశ భయపడటమేంటని ప్రశ్నించారు.

ఎవరికి ఫోన్ చేయాలో ఆమెకు తెలియదా? అన్నారు. ప్రతీది సర్కార్‌పై రుద్దాలని చూడవద్దని మండిపడ్డారు. తల్లిదండ్రులు ఆమెకు ధైర్యాన్ని కల్పించలేదని అన్నారు.ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం నేర్పించడంతో పాటు వారిని ప్రేమతో చూసుకోవాలని చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్ శోభ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలపై పలువురు నెటిజెన్స్ మండిపడుతున్నారు.