దిశ (ప్రియాంక రెడ్డి) నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు. షాద్ నగర్ వద్ద ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు.. సీన్ రీ-కనస్ట్రక్షన్ చేస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులు. పారిపోతున్న నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు. అక్కడికక్కడే మృతి చెందిన నిందితులు.

దిశ ఘటన జరిగిన స్థలంలోనే కామాంధులు ఎన్‌కౌంటర్ గురయ్యారు. దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు.

సంఘటన స్థలంలోనే కరడుకట్టిన కామాంధులైన ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన సంచలనం రేపింది. వీరి ఎన్‌కౌంటర్ తో దిశకు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు. దిశ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.