దిశ హత్య కేసును సత్వరం విచారించి అత్యంత దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఇక తెలంగాణలో ఇది రెండవ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గతంలో వరంగల్ జిల్లాలో చిన్నారిని హత్య చేసిన ఘటనలో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయగా ఆ కేసులో కేవలం 56 రోజుల్లోనే తీర్పు వచ్చింది…

ఇక దిశ హత్యకు పాల్పడిన నిందితులు కొత్త రాగం వినిపిస్తున్నారు “తమకు జైల్లో అసౌకర్యంగా ఉందని దోమలు కుడుతున్నాయని ఒంట్లో బాలేదని, జ్వరం తగిలిందని హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆరీఫ్ కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. ఇక మరో నిందితుడు చెన్నకేశవులు సైతం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు.

ఇలా నిందితులు అనారోగ్యంగా ఉంటే శిక్షలు విధించరు, అలాగే కోర్టుకు కూడా హాజరు పరిచే అవకాశం లేదు” దీని ఆధారంగానే నిందితులు అనారోగ్యమంటూ కొత్త ప్లాన్ వేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు చార్జిషీట్ ఎంత తొందరగా వేస్తారనే దానిపై నిందితులకు శిక్ష ఆధారపడి ఉంది. పోలీసులు వీలైనంత తొందరగా చార్జిషీట్ వేస్తే కోర్టు సత్వరం విచారణ జరిపి నిందితులకు చాలా కొద్ది రోజుల్లోనే శిక్షను ఖరారు చేయనుంది. ఇక హైకోర్టు దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.