రాబోవు దీపావళీ పండుగను పురస్కరించుకోని, టపాకాయలు, బాణాసంచా సామాగ్రి విక్రయించుటకు గాను తాత్కలిక విక్రయకేంద్రాలు ఏర్పాటుకు చేసుకోనేందుకు వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ తరుపున దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డా.వి.రవీందర్‌ బుధవారం ప్రకటన విడుదల చేసారు. అక్టోబర్‌ 27వ తేదిన జరుపునకునే దీపావళీ పండుగ సందర్బంగా వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ (వరంగల్‌ ఆర్బన్‌)లోని వివేకనంద జూనియర్‌ కాలేజీ, హన్మకోండలోని కాకతీయ డీగ్రీ కాలేజీ, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, కాజీపేటలోని వెంకటలక్ష్మీ కూరగాయల మార్కేట్‌, బాపూజీనగర్‌ ప్రాంతాలతో పాటు.

వెస్ట్‌ జోన్‌ (జనగామ జిల్లా), ఈస్ట్‌జోన్‌ (వరంగల్‌ రూరల్‌ జిల్లా)ల్లో టపాకాయలు, యితర బాణాసంచా సామగ్రిని విక్రయించుకోనుటకు గాను, ఏర్పాటు చేసే తాత్కాలిక విక్రయ కేంద్రాల్లో టపాకాయ సామగ్రిని విక్రయించేందుకు అనుమతులు పోందుటకుగాను, ఆసక్తిగల వ్యక్తులు, వ్యాపార సంస్థలు సంబంధిత జోన్ల డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అధికారులకు (డి.సి.పిలు) దరఖాస్తు చేసుకోగలరు.

ఆసక్తిగలవారు ఆగ్నిమాపక, మున్సిపల్‌ కార్పోరేషన్‌ విభాగాల నుండి ఎలాంటి అభ్యంతరాలు లేవనే దృవీకరణ పత్రాలతో పాటు 800/- రూపాయలు పోలీస్‌ శాఖ పేరుపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌లో కట్టిన చలాను జతపర్చి దరఖాస్తులను అక్టోబర్‌ 21వ తారీఖున సంబంధిత డి.సి.పి (డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌) కార్యాలయములో అందజేయాల్సి వుంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతో సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయములో పోలీస్‌ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా తీసి షాపులను కేటాయించబడును.

డ్రాలో ఎంపికైయిన టపాకాల విక్రయ కేంద్రాలకు మాత్రమే తాత్కాలిక విక్రయకేంద్రాలు అనుమతులు జారీ చేయడుతుంది. పోలీస్‌ అధికారులు నిర్థేశించిన విక్రయ కేంద్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో టపాకాయల సామాను విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనబడుతాయి. విక్రయదారులు తప్పనిసరిగా ఎక్స్‌ప్లోసివ్‌ చట్టానికి సూచించిన నియమ నిబంధనలను పాటించి ముందస్తు భద్రత ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుందని వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ సూచించారు…