{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595257213097","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595257139844","source":"other","origin":"unknown"}

దీపికా ప‌దుకొనే 2007లో వ‌చ్చిన ఓం శాంతి ఓం చిత్రంతో హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత షారుక్‌ఖాన్‌, అక్ష‌య్ కుమార్ వంటి బ‌డా హీరోల‌తోపాటు ప‌లువురు యువ హీరోల‌తో క‌లిసి నటించింది. దీపికా కీల‌క పాత్ర‌లో న‌టించిన రామ్ లీలా, బాజీరావ్ మ‌స్తానీ చిత్రాల‌తోపాటు లీడ్ రోల్ పోషించిన ప‌ద్మావ‌త్‌, చ‌పాక్ చిత్రాలు స్టార్ హీరోయిన్ ను చేశాయి. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగువెలుగుతున్న దీపికా ప్ర‌స్తుతం ప్ర‌భాస్-21 చిత్రంలో న‌టించే అవ‌కాశం కొట్టేసింది. అయితే చాలా మంది దీపికా ప‌దుకొనే తొలి చిత్రం ఓం శాంతి ఓం అనే అనుకుంటారు. కానీ దీపికా మొద‌ట క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్రమ ద్వారా న‌టిగా ఎంట్రీ ఇచ్చింది. క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర న‌టించిన ఐశ్వ‌ర్య చిత్రం ద్వారా న‌టిగా ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది. తెలుగులో సూప‌ర్ హిట్ చిత్రం మ‌న్మ‌థుడుకు ఇది రీమేక్‌.