ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు నాగ‌లి ప‌ట్టుకుని దుక్కి దున్న‌తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఈ వీడియోపై ప్ర‌ముఖ సినీ న‌టుడు సోనూసూద్ స్పందించి, వారి కుటుంబానికి అండ‌గా నిలిచాడు. వివ‌రాల్లోకి వెళితే: చిత్తూరు జిల్లా మ‌హ‌ల్ రాజువారి పల్లెవాసి వీర‌తాళ్ల నాగేశ్వ‌ర్ రావు మ‌ద‌న‌ప‌ల్లెలో టీ స్టాల్ నడుపుతూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో లాక్ డౌన్ కార‌ణంగా నాగేశ్వ‌ర్ రావు ఉపాధి కోల్పోయాడు. దీంతో పొట్ట‌కూటి కోసం పొలం పనుల‌ను న‌మ్ముకున్నాడు. అయితే ఎద్దులు లేక‌పోవ‌డంతో నాగేశ్వ‌ర్ రావు కూతుళ్లు వెన్నెల ‌(12వ త‌ర‌గ‌తి), చంద‌న (10వ త‌ర‌గ‌తి) నాగ‌లి ప‌ట్టి దున్నారు. వారి త‌ల్లి విత్త‌నాలు వేసింది. క‌రోనా ప్ర‌భావంతో ఇబ్బందులు ప‌డుతున్న నాగేశ్వ‌ర్ రావు కుటుంబానికి కావాల్సింది ఎద్దులు కావ‌ని, ట్రాక్ట‌ర్ అని భావించిన సోనూసూద్‌. వారికి ట్రాక్ట‌ర్ ను పంపుతున్న‌ట్టు ట్వీట్ చేశాడు. పోనూసూద్ గొప్ప మ‌న‌సుపై అంద‌రూ ప్ర‌శంస‌ల జల్లు కురిపిస్తున్నారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సోనూసూద్ ఇప్ప‌టికే ఎన్నో కుటుంబాల‌కు నిలిచాడు.