ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్‌ అనే యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా శేజల్‌ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. ఈ క్రమంలో కమిషన్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, అంతకుముందు బాధితురాలు శేజల్‌ వేధింపుల అంశంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

దీంతో, జాతీయ మహిళా కమిషన్‌ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్‌ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. ఇక, 15 రోజుల్లో దీనిపై అప్‌డేట్‌ ఇవ్వాలని కమిషన్‌ లేఖలో పేర్కొంది.