{"subsource":"done_button","uid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1589273057734","source":"other","origin":"gallery","sources":["325084568150201"],"source_sid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1589273331940"}

దొరల రాజ్యం ఇంకెంత కాలం నడుస్తదో తెల్వదు’అంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన పండ్ల విక్రయ కేంద్రాన్ని సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇతర టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ తాను ఏం మాట్లాడినా తప్పే అంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ సమక్షంలో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ఈ వ్యాఖ్యలు చేసారు.

మంత్రి కేటీఆర్ చొరవతో మిర్చి నుంచి నూనె తీసే ఫ్యాక్టరీ త్వరలోనే ఏర్పాటు కానుందని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడే సమయంలో మరికొంత మంది నాయకులు కలుగచేసుకుని మాట్లాడుతూ ఆ ఫ్యాక్టరీ పనులు డోర్నకల్‌ నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ మాటలతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మేల్యే గ్రామాలు, పట్టణాలు అభిచెందాలంటే ప్రధాన కార్యాలయాలు జిల్లా కేంద్రంలో ఉండాలని తెలిపారు.

ఏం రాజ్యాంగమో, ఎవరు కనిపెట్టారో తెలియదు.. అన్నం పెట్టే రైతుకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందని మాట్లాడారు. అన్నం లేకుండా ఏ ఒక్కరు బతకలేరని, అలాంటి వరిని పండించే రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులను మోసం చేసేవారికి ఉరి శిక్ష విధించాలన్నారు. విక్రయం చేసే ప్రతి ఒక్క వస్తువుకు తయారు చేసే వారే ధరలను నిర్ణయిస్తారని, మరి రైతుకెందుకు ఆ అవకాశం ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.