తెలంగాణ రాష్ట్రంలో వరుస దారుణ హత్య లు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న యాదాద్రి యువతి హత్యాచార ఘటన నుండి ఇంకా ప్రజలు బయటకు రాకముందే, నల్గొండలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనగ్నంగా ఉన్న మహిళ మృతదేహం మంటల్లో కాలిపోయిన స్థితిలో లభ్యమైంది. ఆమెకు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతురాలి ఎడమ చేతిపై బుజ్జి అనే పచ్చబొట్టు ,ఆమె కాళ్లకి వెండిపట్టీలు ఉన్నాయి. వాటిపై జేజే అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆనవాళ్లను బట్టి ఎవరైనా మహిళని గుర్తిస్తే తమను సంప్రదించాలని నార్కెట్‌పల్లి పోలీసులు కోరారు.