ప్రెగ్నెన్సి వచ్చిందని తెలువడంతో

జూనియర్ అర్టిస్ట్ తనను రేప్ చేశాడని ఓ బుల్లితెర నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్ లో ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘నచ్ బలియే’ వంటి ప్రొగ్రామ్ లు చేస్తున్న నటితో హర్యానాలోని యమునా నగర్ కు చెందిన ఓ జూనియర్ అర్టిస్ట్ పరిచయం పెంచుకున్నాడు. అక్టోబర్ లో ముంబయిలోని ఓ హోటల్‌కు తనను రమ్మని చెప్పాడని, ఆ తర్వాత తనకు జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడని నటి పేర్కొంది.

జ్యూస్ తాగిన తర్వాత తాను మత్తులోకి వెళ్లడంతో అతను రేప్ చేశాడని చెప్పింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సి వచ్చిందని తెలువడంతో తనను పెళ్లి చేసుకోమని అడిగానని అందుకు అతడు నిరాకరించాడని పేర్కొంది. అప్పటి నుంచి అతను ముఖం చాటేశాడని నటి వాపోయింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని, అయితే నిందితుడు పరారిలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.