సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం సందడిగా జరిగింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లో జరిగిన ఈ వేడుకలో నటీనటులు, సాంకేతిక నిపుణులు సందడి చేశారు. నటీనటులతో పాటు నిర్మాత అల్లు అరవింద్‌ డాన్స్‌ చేసి అందరినీ అలరించారు. సాయిధరమ్ తేజ్ స్వయంగా ఆయనను వేది​క మీదకు తీసుకెళ్లి డాన్స్‌ చేయాలని కోరారు. సీనియర్‌ నటుడు సత్యరాజ్‌తో కలిసి హుషారుగా వేదికపై స్టెప్పులేశారు. మరో నిర్మాత బన్నీ వాసు కూడా హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నృత్యం చేశారు. ‘తకిట తథిమి’ పాటకు హీరో, హీరోయిన్లతో పాటు మిగతా నటులు కూడా డాన్స్‌ చేయడంతో సందడి వాతావరణం నెలకొంది.