తిరువనంతపురం: ఇప్పటివరకు నటులు నటిమణులను లైంగికంగా వేధించిన ఘటనలు చూశాము. మీటూ ఉద్యమంతో కొందరు హీరోయిన్ల తనకు జరిగిన అనుభవాలను బయటపెట్టారు. తాజాగా ఓ దర్శకురాలు ఓ హీరోను లైంగికంగా వేధించిన సంఘటన సౌత్ సినీ ఇండస్ట్రీలో జరిగింది. కేరళ సినిమా ఇండస్ట్రీకు చెందిన లక్ష్మీ దీప అనే లేడీ డైరెక్టర్ మంచి సినిమాలు తీయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆమె సినిమా డైరెక్ట్ చేసిందంటే చాలు హిట్ పడాల్సిందే. ఓ వెబ్ సిరీస్‌లో నటించిన ప్రధాన నటుడు తనపై ఆమె వేధింపులకు గురి చేసిందని ఆరోపణలు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించాడు.

కోర్టు దీపను అరెస్ట్ చేయాల్సిందిగా కేరళ పోలీసులను ఆదేశించింది. వెబ్ సిరీస్ చేస్తుండగా అతడిని బూతు సీన్లు చేయాల్సిందిగా ఆమె కోరడంతో అతడు తిరస్కరించాడు. కానీ కాంట్రాక్ట్ పేరుతో తనని బయటపెట్టి అభ్యంతరకర సీన్లలో నటించేలా చేసింది. దీనికి సంబంధించిన షూటింగ్ 2022 అరువిక్కురలో జరిగింది. అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు.