విఘ్నేష్ నిన్న మదర్స్ డే సందర్భంగా ఓ విషయం తేల్చి చెప్పాడు. తన పిల్లలకు జన్మనివ్వబోయే తల్లికి హ్యాపీ మదర్స్‌ డే అంటూ నయన్ ఓ పిల్లాడిని ఎత్తుకున్న ఫొటో పెట్టి ట్వీట్ తోసేశాడు. ‘నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృదినోత్సవ శుభాకంక్షలు..’ అని అన్నాడు. నయన్ తల్లికి కూడా విషెష్ చేశాడు. ‘ఒక అందమైన పిల్లను మీరు అద్భుతంగా పెంచారు. లవ్‌ యు సో మచ్. థ్యాంక్యు అమ్ము‘ అని కొనియాడాడు. నటుడు శింబు, యాక్టర్ డాన్సర్ ప్రభుదేవాతో ప్రేమవైఫల్యాల తర్వాత నయన్ విఘ్నేష్ కు చేరువైంది. ప్రేమికులు రోజు, న్యూ ఇయర్ రోజున వీళ్లు విదేశాల్లో రొమాంటిగ్గా గడిపేశారు.