నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సౌత్ లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఎండ్రిక్ హఠన్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందాడు. రోజులాగే ఉద్యోగ నిమిత్తం ఆఫీసుకు బయలుదేరిన హఠన్ అధిక వేగంతో ద్విచక్రవాహనాన్ని నడిపాడు. నల్లకుంట మెయిన్ రోడ్డు వద్దకు చేరుకోగానే బైక్ ఓ స్తంభానికి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు . అనంనతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.