పెళ్లిన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం సుబ్రహ్మణ్యనగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది . జయలక్ష్మి ( 24 ) అనే మహిళకు నాలుగు నెలల క్రితం బెంగళూరు నగరంలో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది . అప్పటి నుంచి ఇద్దరు ఉత్తరహళ్లిలో నివాసం ఉంటున్నారు . బుధవా రం భర్త కార్యాలయానికి వెళ్లిన అనంతరం జయలక్ష్మి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది . సుబ్రహ్మణ్య పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు . ఆత్మహత్యకు దారితీసిన కారణాలు వెల్లడి కావాల్సి ఉంది …